సావిత్రి పాత్రలో సమంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరపై చెరగని ముద్రవేసిన నటీమణి ఎవరంటే అందరూ చెప్పే సమాధానం ఒక్కటే- అది మహానటి సావిత్రి. పాత్రలో లీనమై నటించి ప్రేక్షకుల హృదయాల్ని రంజింపచేయగల ఈమె జీవితం తెరపైకి వస్తోంది. ఈమధ్యే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ రూపొందించే ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే సావిత్రి జీవితానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాడని, దానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ కూడా పూర్తయినట్టు తెలిసింది. అయితే, ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆమధ్య బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తుందంటూ వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్రను సమంత పోషిస్తోందని తెలిసింది. దానికి కారణం- సమంత ట్విట్టర్‌లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు గురించి మీకు త్వరలో చెబుతాను అంటూ పోస్ట్ చేయడంతో, సమంత నటించేది మహానటి సావిత్రి బయోగ్రఫిలో అని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె నిర్మించనుంది. మరి ఇందులో సమంత నటస్తుందా లేదా అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.