తండ్రీకూతుళ్ల అనుబంధం తెలిపే బాయ్‌ఫ్రెండ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుమారి 21ఎఫ్’తో సంచలన కథానాయికగా మారింది హెబ్బాపటేల్. ‘అలా ఎలా’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈమెకు ‘కుమారి 21ఎఫ్’ చిత్రం టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తరువాత మరో రెండు చిత్రాల్లో నటించి వరుస విజయాలతో దూసుకుపోతున్న హెబ్బా, తాజాగా నటిస్తున్న చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి భాస్కర్ దర్శకుడు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 16న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ హెబ్బాపటేల్ చెప్పిన విశేషాలు..

నో బాయ్‌ఫ్రెండ్స్
ఈ సినిమాలో నాకు ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్ వుంటారు కానీ, నా రియల్ లైఫ్‌లో మాత్రం ఆ చాన్స్ లేదు. ఎందుకంటే, ప్రేమించేటంత సమయం ఎక్కడిది, పైగా మేం చదువుకున్నదంతా గర్ల్స్ కాలేజీలోనే.
పల్లెటూరి అమ్మాయిగా..
ఈ చిత్రంలో పద్మావతి అనే పాత్రలో పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తాను. పల్లెటూరునుంచి వచ్చి ముంబైకి వచ్చి అక్కడ ఒక తప్పు చేస్తుంది. ఆ తప్పువల్ల అందరూ ఎలా ఎఫెక్ట్ అయ్యారు అన్నదే అసలు కథాంశం. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ళ నేపథ్యంలో సాగే సినిమా ఇది. అలాగని ప్రత్యేకమైన అమ్మాయిగా కనిపించను. కథ నచ్చడానికి కారణం రెండు అంశాలు. ఒకటి- ఫ్రెండ్స్‌తో వుండటం, రెండోది నాన్నతో రిలేషన్‌షిప్.
రియల్ లైఫ్‌గానే
తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని దర్శకుడు చక్కగా ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమాలో చూపించినట్టుగానే నాకు మా నాన్నకు మధ్య అనుబంధం వుంది. అయితే నాన్నంటే కొంచెం భయం. అందుకే సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడను. ఆ విషయాల్ని సిస్టర్స్, ఆంటీతో పంచుకుంటా.
క్రేజీ ప్రాజెక్టు
ఈ సినిమా మంచి కథతోనే కాకుండా ఈ ప్రాజెక్టులో క్రేజీ వ్యక్తులు ఇన్‌వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా ఛోటా కె నాయుడు లాంటి కెమెరామెన్‌తో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. దాంతోపాటు దిల్‌రాజు సినిమాను విడుదల చేయడంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. దాంతోపాటు నిర్మాత వేణుగోపాల్ ప్రతి విషయంలో దగ్గరుండి చూసుకుంటున్నారు.
అదే సస్పెన్స్
ఈ సినిమాలో నాకు ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్ వుంటారు. అందులో కీలక పాత్ర ఎవరిది అనేది చెప్పలేము. ఫైనల్‌గా ఎవరిని పెళ్లిచేసుకుంటాను అనేది సస్పెన్స్. ఈ సినిమాలో రావు రమేష్‌ది ముఖ్యపాత్ర అని చెప్పాలి. ఆయనతో నటించడం ఎగ్జైటింగ్‌గా వుంది.
గ్లామర్ పాత్రల్లో..
నేను గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తున్నానని కొందరు అంటున్నారు. మరికొందరేమో పక్కింటి అమ్మాయిలా ఉండే పాత్రలు చేస్తున్నానంటున్నారు. ఏదైనా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పాత్రలు చేయడమే నాకిష్టం. గ్లామర్ పాత్రలు కూడా చేయాలని వుంది.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నాను. ‘అందగాడు’, ‘మిస్టర్’ చిత్రాలున్నాయి. దాంతోపాటు తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ తెలుగులో బిజీగా వుండడంవల్ల అవి ఒప్పుకోవడం కుదరడంలేదు.

-శ్రీ