సెన్సార్‌లో నేత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, ఐశ్వర్య అడ్డాల ప్రధాన తారాగణంగా రామ్ క్రియేషన్స్ పతాకంపై రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము రూపొందించిన చిత్రం నేత్ర (మై స్వీట్ హార్ట్). ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, దర్శకుడు చెప్పినదానికన్నా సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. లవ్ అండ్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాలో ప్రేక్షకుడికి కావలసిన అన్ని అంశాలు ఉన్నాయని, కెమెరా పనితనం హైలెట్‌గా ఉంటుందని దర్శకుడు రెడ్డెం యాదకుమార్ అన్నారు. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారిందని, విడుదలయ్యాక అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.
సత్యానంద్, త్రినాధ్, ధీరేంద్ర ధీరు, సత్యనారాయణ, హేమ, రేణుక, ప్రియాంక, తిరుమలరెడ్డి, అప్పారావు, జనార్దన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఉదయ్‌నాగ్ రతన్‌దాస్, మాటలు:ప్రసాదుల మధుబాబు, కెమెరా:వి.ఎస్.గోపాల్, ఎడిటింగ్:నర్సింగ్ రాధోడ్, నిర్మాత:పీరికట్ల రాము, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రెడ్డెం యాదకుమార్.