ఇద్దరి మధ్య 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌కార్తిక్, భాను త్రిపాఠి జంటగా ఎస్‌ఆర్‌పి విజువల్స్ పతాకంపై సాయి తేజా పాటిల్ సమర్పణలో నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ రూపొందిస్తున్న చిత్రం ఇద్దరిమధ్య 18. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా పోస్టర్‌ను తెలంగాణ మంత్రి హరీష్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ- అన్ని కమర్షియల్ హంగులతో యూత్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో యువతకు సందేశం కూడా వుంటుందని, త్వరలో ఆడియోను విడుదల చేసి ఈనెలాఖరుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. బిత్తిరి సత్తి ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రవిప్రకాష్, శివన్నారాయణ, బాబి లహరి, రాము, రఘు, అప్పారావు, చిట్టిబాబు, చమ్మక్ చంద్ర ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా:జి.ఎల్.బాబు, పాటలు:కందికొండ, వరికుప్పల యాదగిరి, రామ్ పైడిశెట్టి, చిలుకరెక్క గణేశ్, నిర్మాత:శివరాజ్‌పాటిల్, కథ, దర్శకత్వం:నాని ఆచార్య.