అమితాబ్ సినిమాలో చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పృధ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతిసోధి హీరోయిన్లుగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రం డిసెంబర్ 16న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ సలోని బుధవారం సినిమా గురించిన సంగతులను పాత్రికేయులతో ముచ్చటించారు. బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్‌తో నిర్మించబోయే ఓ సినిమాలో తనకు అవకాశం ఉందని అంటున్న సలోని ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
‘మీలో ఎవరు కోటీశ్వరుడు లవ్, రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ఒక ఐడియా నలుగురు ప్రేమికుల జీవితాన్ని ఎలా మార్చిందనేది కానె్సప్ట్. హండ్రెడ్ పర్సెంట్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో పృధ్వీకి జోడీగా నటించాను. పృధ్వీ మహేష్ క్యారెక్టర్‌లో నటించారు. నేను సమంత క్యారెక్టర్‌లో నటించాను. ఇంటర్మీడియెట్ స్టూడెంట్స్‌గా ఇద్దరి నటన అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. నన్ను అందరూ ర్యాగింగ్ చేస్తుంటారు. పృధ్వీ సేవ్ చేస్తుంటాడు. నన్ను ఫాలో అవుతూ స్టడీ చేస్తుంటాడు. అలా మా ఇద్దరిమధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. కాలేజ్ యాన్యువల్ డే రోజున మా ఇద్దరిమధ్య ఓ పెప్సీ సాంగ్ వస్తుంది. గణేష్ మాస్టర్ ఆ సాంగ్‌ను ఎంతో బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేశారు. పృధ్వీ స్టెప్స్ చాలా స్టయిలిష్‌గా వుంటాయి. సెట్‌లో యూనిట్ అంతా క్లాప్స్, విజిల్స్ కొట్టారు. అంతా ఫన్నీగా ఉంటుంది. ఈ సినిమాలో ఫృధ్వీ డిఫరెంట్ కామెడీ చేశారు. స్పాంటేనియస్ పంచ్‌లు, సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. రొమాంటిక్ సీన్స్‌లో పృధ్వీ నటన అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ సత్తిబాబు కూల్ పర్సన్. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ను ఫెంటాస్టిక్‌గా డిజైన్ చేశారు. ఒక ప్రెష్ లవ్‌స్టోరీని జెన్యూన్‌గా తెరకెక్కించారు. కామెడీ, ఎమోషనల్ సీన్స్‌ను అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఆయన డైరెక్షన్‌లో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా దృష్టిలో కమెడియన్స్ కూడా హీరోలే. ప్రస్తుతం ‘జబర్దస్త్’, ‘పటాస్’ సహా అన్ని టీవీ షోస్‌లో స్పాంటేనియస్ కామెడీని క్రియేట్ చేస్తున్నారు. కామెడీ సీన్స్‌లో నటించడం చాలా కష్టం. నా మనసుకు నచ్చితే ఎవరితోనైనా నటిస్తాను. నేనొక ఆర్టిస్టును కాబట్టి పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ వున్న ప్రతి క్యారెక్టర్‌ను చేయడానికి ప్రయత్నిస్తాను. అది నా బాధ్యత. ప్రతి సినిమాలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటుంటాను. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్‌లో వర్క్ చేయడం హ్యాపీగా వుంది. రాధామోహన్ ఎంతో లావిష్‌గా నిర్మించారు. ‘మర్యాద రామన్న’ తర్వాత ప్రతి ఒక్కరూ విలేజ్‌గర్ల్ పాత్రలో నటించమని అప్రోచ్ అయ్యారు. చాలావరకు అవాయిడ్ చేశాను. హిందీలో అమితాబ్‌తో ఓ సినిమా డిస్కషన్స్‌లో వుంది. తమిళ, తెలుగు చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

-యు