రావిశాస్ర్తీ మనవడు హీరోగా పిట్టగోడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వదేవ్ రాచకొండ, పునర్నివి భూపాలం జంటగా సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్స్ సినిమాస్ పతాకాలపై అనుదీప్.కె.వి. దర్శకత్వంలో రామ్మోహన్.పి, దినేష్‌కుమార్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘పిట్టగోడ’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత పి.రామ్మోహన్ మాట్లాడుతూ, ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో ఓ చిన్న పాత్ర చేసిన పునర్నవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిందని, ఓ తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా వుందని అన్నారు. రావిశాస్ర్తీ మనవుడు విశ్వదేవ్ షార్ట్ ఫిలిం చూసి హీరోగా ఎంపిక చేశామని, దర్శకుడు హాస్యోక్తులతో ఓ కథ తయారు చేశాడని, అలా ఈ సినిమా ప్రారంభమైందని తెలిపాడు. షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయని, ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. నేను చూసిన కొన్ని ఫన్నీ సంఘటనలు బేస్ చేసుకుని ఈ కథను సిద్ధం చేశానని, రియలిస్టిక్ అప్రోచ్‌తో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతుందని దర్శకుడు అనదీప్ అన్నారు. ప్రతి ఒక్కరికీ వాళ్ల జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఈ సినిమా చూస్తే గుర్తొస్తాయని, తప్పక ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన అన్నారు.