బోయపాటితో మరోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యామిలీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న జగపతిబాబు, కొంత బ్రేక్ తరువాత ‘లెజెండ్’ చిత్రంతో విలన్‌గా మారాడు. ఆయన్ను అలా మార్చింది దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న జగపతిబాబుకు ఆ తరహా పాత్రలు క్యూకట్టాయి. ప్రస్తుతం విలన్‌గా తెలుగు, తమిళ భాషల్లో జోరుమీదున్న జగపతిబాబు, మరోసారి బోయపాటి శ్రీను సినిమాలో నటిస్తున్నాడు. బోయపాటి గతంలో చూపిన పాత్రకంటే ఇంకా పవర్‌ఫుల్ విలన్‌గా కన్పిస్తాడట. ఆ వివరాల్లోకి వెళితే, బోయపాటి శ్రీను ప్రస్తుతం రూపొందిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం వైజాగ్‌లో షూటింగ్ జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో జగపతిబాబు చేరారు. ఆయనతో రూపొందిస్తున్న సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయట. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి జగపతిబాబు క్రేజ్ ఇంకాస్త పెరగనున్నట్టు యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి.