ఆసక్తి రేపుతున్న నయనతార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం సినిమాలపై బాగా ఫోకస్ పెట్టింది. భిన్నమైన సినిమాల్ని ఎంచుకుంటూ దూసుకుపోతోంది. అటు స్టార్ హీరోలతో భిన్నమైన కథలతో సినిమాలు చేస్తున్న ఈ భామ తాజాగా ఓ సినిమా కోసం 7 కోట్ల పారితోషికం అడిగిందనే వార్త కోలీవుడ్‌లో సంచలనం రేపింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న ఈమె, ఇటీవలే మయూరి చిత్రంతో భయపెట్టింది. హారర్ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా ఇచ్చిన ఊపుతో మరో హారర్ సినిమాలో నటిస్తోంది. డోరా పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ఆసక్తి రేపుతోం ది. ఈ సినిమాతో నయనతార మరో కమర్షియల్ విజయా న్ని తన ఖాతలో వేసుకుంటుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో డోరా పేరుతోనే విడుదల చేస్తున్నారు.