సునీల్ గోల్డెహె! ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోరుమీదున్నాడు. ఇప్పటికే ‘కృష్ణాష్టమి’తోపాటు మరో చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘ఈడు గోల్డెహె’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. వీరూ పోట్ల దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. ‘బిందాస్’, ‘రగడ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరూ పోట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సునీల్ సరసన సుష్మారాజ్, రిచా పనయ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. జనవరి 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని త్వరలోనే పూర్తిచేసి వేసవి కానుకగా విడుదల చేస్తారట. ఈ చిత్రానికి సంగీతం:సాగర్ మహదేవ్, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, దర్శకత్వం: వీరూ పోట్ల.