ఓం నమో వేంకటేశాయ టీజర్ 24న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావుకాంబినేషన్‌లో గతంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి చిత్రాలు ఎంత్ఘగా విజయవంతమయ్యాయో తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ మరో సూపర్‌హిట్‌గా నిలుస్తుందని నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి తెలిపారు. సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈనెల 24న సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. నాగార్జున హథీరామ్ బాబాగా మరో వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్వరస్వామిగా హిందీ సీరియల్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్న సౌరభ్‌జైన్ నటిస్తున్నార ని నిర్మాత తెలిపారు. భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క పాత్ర సినిమాలో హైలెట్‌గా వుంటుందని, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్, విమలారామన్‌ల పాత్రలు కూడా సినిమాలో కీలకంగా వుంటాయని ఆయన అన్నారు. భక్తిరస చిత్రాలను అత్యద్భుతంగా తీయడంలో సిద్ధహస్తుడైన రాఘవేంద్రరావు ఈ చిత్రంలో తన మార్కు తప్పక చూపిస్తారని అన్నా రు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, నిర్మాత:ఎ.మహేష్‌రెడ్డి, దర్శకత్వం:కె.రాఘవేంద్రరావు.