త్వరలో ఓదార్పుయాత్రూత్ర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సాయిరంగా ఫిలింస్ పతాకంపై ఎస్.డి.రమేశ్ సెల్వన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘వజ్రం’ చిత్రాన్ని తెలుగులో ‘ఓదార్పుయాత్ర’గా అందిస్తున్నారు. శ్రీరామ్, కిశోర్, పాండి, కుట్టిమణి ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ చిత్రానికి నిర్మాత కె.రంగారావు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, దుర్మార్గులకు అంతిమయాత్ర, మంచివారికి ఓదార్పు యాత్ర అనే ఇతివృత్తంతో రాజకీయ నేపథ్యంతో జరిగే క్రైం థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉంటుందని, ప్రేక్షకులు ఊహించని మలుపులతో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుందని, సందేశాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో రెండు పాటలు ఉన్నాయని తెలిపారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. తంబి రామయ్య, జయప్రకాష్, మైలస్వామి, భవానిరెడ్డి, సన తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ఎ.ఆర్.కుమరేశన్, ఎడిటింగ్:మరీష్, మాటలు, పాటలు:వెనె్నలకంటి, సంగీతం:ఎఫ్.ఎం.ఫైజల్, నిర్మాత:కె.రంగారావు, దర్శకత్వం:ఎస్.డి.రమేశ్ సెల్వన్.