అందాల అవంతిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్ణ కథానాయికగా భీమవరం టాకీస్ పతాకంపై శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ రూపొందించిన చిత్రం ‘అవంతిక’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కొణిజేటి రోశయ్య విడుదల చేశారు. తన చిరకాల మిత్రుడు, సన్నిహితుడు అయిన నిర్మాత తుమ్మలపల్లి త్వరలోనే వంద చిత్రాలు నిర్మించాలని ఆయన అభిలషించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరాజ్ బళ్లా మాట్లాడుతూ- ఓ అందమైన కథనానికి అద్భుతమైన కథనం జోడించి అందాల అవంతికను నిర్మించామని, ప్రతిఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని తెలిపారు. దర్శకుడు సినిమాను వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో చిత్రీకరించాడని, అతనికి మంచి భవిష్యత్తు వుంటుందని నిర్మాత సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్, శివాజీరాజా, కృష్ణుడు, సత్యారెడ్డి పాల్గొని విశేషాలను తెలిపారు. గీతాంజలి, షాయాజీషిండే, అజయ్ ఘోష్, షకలక శంకర్, ధన్‌రాజ్, శ్రీరాజ్, రవిరాజ్, సంపత్‌రెడ్డి, గిరిధర్, ఫణిరాజ్, మల్లిక, విజయకుమార్ నటించిన ఈ చిత్రానికి కెమెరా:కర్ణ ప్యారసాని, ఎడిటింగ్:సోమేశ్వర్ పోచం, మాటలు:క్రాంతినైనా, పాటలు:్భరతీబాబు, సంగీతం:రవిరాజ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీరాజ్ బళ్లా.