ఎన్టీఆర్‌తో క్రిష్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జనతా గ్యారేజ్’ తరువాత ఎన్టీఆర్ తన 27వ సినిమాకు ఫిక్స్ అయ్యాడు. ‘పవర్’ ఫేమ్ బాబీ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు ఎన్టీఆర్. ఈ సినిమా జనవరిలో సెట్స్‌పైకి రానుంది. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఓ క్రేజీ దర్శకుడు? ఆయన ఎవరో కాదు క్రిష్! ప్రస్తుతం బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా చేస్తున్న క్రిష్ స్పీడ్ పెంచాడు. ఈ సినిమా తరువాత ఆయన ఎన్టీఆర్ కోసం ఓ కథ కూడా సిద్ధం చేశాడట. ప్రస్తుతం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో బిజీగా వున్న క్రిష్, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ సినిమాపై దృష్టిపెడతాడట. ఇక ఎన్టీఆర్ బాబీ సినిమా తరువాత త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా గనక ఆలస్యం అయితే ఈమధ్యలో క్రిష్ సినిమా పట్టాలు ఎక్కే ఛాన్స్ వుంది. కొత్త సంవత్సరంలో ఈ సినిమా ప్రకటన వెలువడే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.