కోటీశ్వరుడుకి ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడుదలైన రోజునుంచీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని, బి, సి కేంద్రాలలో అద్భుతమైన రెస్పాన్స్ దొరికిందని, కామెడీతో ప్రేక్షకులు విపరీతంగా నవ్వుతూ వౌత్ టాక్‌తో సినిమాను హిట్ రేంజ్‌లో నడిపిస్తున్నారని నిర్మాత కె.కె.రాధామోహన్ తెలిపారు. నవీన్ చంద్ర, పృధ్వీ, సలోని, శృతిసోధి ప్రధాన తారాగణంగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ రూపొందించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో మంచి విజయం సాధిస్తోందని నిర్మాత తెలుపుతున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- అన్ని కేంద్రాల్లో మంచి కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా తమ సంస్థకు మరో సూపర్‌హిట్ సినిమాగా నిలిచిందని, పృధ్వీ పాత్ర సినిమాలో హైలెట్‌గా వుందని తెలిపారు. సినిమా ప్రారంభంనుండి చివరివరకూ ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని ఆయన అన్నారు. తాను ఈ చిత్రంలో హీరోగా నటించానని, ప్రేక్షకుల్లో తన పాత్రకు మంచి ఆదరణ లభిస్తున్నందుకు హ్యాపీగా వుందని, అందరూ ఫోన్లు చేసి అభినందిస్తుంటే ఓ మంచి అవకాశం ఈ సినిమా ద్వారా దొరికిందని తాను భావిస్తున్నట్లుగా హీరో పృధ్వీ తెలిపారు. పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, చలపతిరావు, ప్రభాస్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:శ్రీవసంత్, కెమెరా:బాల్‌రెడ్డి.పి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఇ.సత్తిబాబు.