వెండితెరపై సంక్రాంతి సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది సినిమాలకు కొత్త ఉత్సాహాన్ని అందించిందని చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఈ ఏడాది విడుదలైన సినిమాల విజయాలను చూస్తే అర్థం అవుతుంది. భిన్నమైన కథనాలతో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఈ ఏడాది ముగిసిపోతోంది. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకులకు జాతర. సంక్రాంతి సందడి అప్పుడే మొదలైనట్టు కనిపిస్తుంది. ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఎనిమిది దశాబ్దాల తెలుగు సినిమా ఇంతవరకూ కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్ సినిమాలు వచ్చే ఏడాదిలో పలకరిస్తున్నాయి. సంక్రాంతి అంటేనే సినిమాకు పెద్ద పండగ. మరి అలాంటి ఈ సంక్రాంతి పోటీ ఎలా ఉంటుందో చూద్దామా..
‘ఖైదీ’తో మొదలు
చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎనిమిదేళ్లు పట్టాయి. అభిమానుల ఆకాంక్ష మేరకు 150వ సినిమాలో నటించేందుకు సన్నద్ధమైన మెగాస్టార్ కథల విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ఖరారైనా సినిమా ఫైనల్‌గా వినాయక్ చేతిలోకి వెళ్లింది. తమిళ రీమేక్ ‘కత్తి’ కథను ఓకే చెయ్యడం, ఆ తరువాత మొదలు అవ్వడంతో సినిమా పూర్తయ్యింది. చిరంజీవి కెరీర్‌ను మలుపు తప్పిన ‘ఖైదీ’ సినిమా టైటిల్‌నే మరోసారి ఖైదీ నెం.150గా కొత్త సినిమాకు ప్రకటించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెస్తున్న చిరంజీవి 150వ సినిమా 2017 సంక్రాంతి బరిలో దిగింది.
శాతకర్ణి క్రేజ్
ఇక ఈ పోటీలో దిగాడు మరో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాను ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గా దర్శకుడు క్రిష్ చెప్పిన కథను ఓకే చేశారు. ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ చిత్రం 2017 జనవరి సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. క్రిష్ ‘గమ్యం’, ‘వేదం’ తరువాత తీసిన సినిమాలు అంతగా ప్రేక్షక మన్ననలు పొందలేకపోయాయి. 2015లో క్రిష్ దర్శకత్వం వహించిన ‘కంచె’ సినిమా ఇటు ప్రేక్షకులలోనూ, అటు విమర్శకుల మన్ననలు పొందింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
గురు, బాహుబలి-2 సందడి
ఈ సినిమాల తరువాత విక్టరీ వెంకటేష్ ‘గురు’ సినిమాతో సిద్ధం అవుతున్నాడు. అన్ని షూటింగ్ జోరుగా పూర్తికావచ్చినా ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ కొన్ని కారణాలవల్ల కుదరక ఈ సంక్రాంతి తరువాత విడుదల కానుంది. ఇక తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ భారీ బడ్జెట్ మూవీ శంకర్ దర్శకత్వంలో రానున్న ‘2.0’ సినిమా కూడా కొత్త ఏడాది ప్రథమంలోనే విడుదల కానుంది. దాంతోపాటు ఓటమి ఎరుగని దర్శకుడు రాజవౌళి సీక్వెల్ ‘బాహుబలి-2’ కూడా 2017 ప్రథమార్థంలో వస్తున్నట్లు తెలియజేశారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న ‘బాహుబలి’ సీక్వెల్ చూసేందుకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొదటి భాగంలో సంధించిన ప్రశ్నలకు రెండవ భాగంలో సమాధానం కోసం ఆ ఉత్కంఠ కావచ్చు. దాంతోపాటు సూపర్‌స్టార్ మహేష్‌బాబు-మురగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజు. మహేష్‌బాబుకు కూడా ఈ సినిమా అతని కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీనే. అందునా మురగదాస్ రజనీ, ఠాగూర్, తుపాకి, కత్తి లాంటి సూపర్‌హిట్‌లను అందించడంతో సహజంగానే ఈ ఇద్దరి కాంబినేషన్‌కు భారీ క్రేజ్ నెలకొంది. మొత్తానికి వచ్చే ఏడాది సినిమా అభిమానులకు భారీ హంగామా రానుంది.

-శ్రీ