అశ్లీలతకు చోటులేని వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరీశ్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ.బి. దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు రూపొందిస్తున్న చిత్రం ‘వైశాఖం’. ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకురాలు జయ.బి. మాట్లాడుతూ- కుటుంబమంతా కలిసి ఈ సినిమాను చూసేలా ఎక్కడ ఆశ్లీలత లేకుండా రూపొందించామని, లవ్‌లీ సినిమా హిట్ తరువాత ఓ సూపర్‌హిట్ సినిమాను ఇవ్వాలన్న లక్ష్యంతో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ మేళవించి రూపొందించిన కథ, కథనాలు సినిమాకు హైలెట్‌గా వుంటాయని తెలిపారు. ఓ అపార్ట్‌మెంట్ సంస్కృతిలో ఉన్న హీరో హీరోయిన్ల మధ్య జరిగే ప్రేమకథ ఎలా సాగింది అనేదే ఈ చిత్రంలో ప్రధానాంశమని, కజకిస్తాన్ దేశంలో చిత్రీకరించిన పాటలు సినిమాకు హైలెట్‌గా వుంటాయని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. తమ సంస్థ ద్వారా అందించిన చిత్రాలన్నీ విజయవంతమయ్యాయని, ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్న సినిమాల కోవలోనే వైశాఖం చిత్రాన్ని నిర్మించామని, చిన్న చిత్రమైనా భారీ బడ్జెట్‌లోనే హైటెక్నికల్ విలువలతో రూపొందించామని నిర్మాత బి.ఎ.రాజు అన్నారు. హిందీ, తమిళ రైట్స్‌కోసం ఆఫర్లు వస్తుండడమే ఈ సినిమాపై వున్న అంచనాలను తెలుపుతున్నాయని, సాయికుమార్ నటించిన ఓ పాత్ర హైలెట్‌గా వుంటుందని ఆయన తెలిపారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృధ్వీ, కాశీవిశ్వనాథ్, కృష్ణ్భగవాన్, శ్రీలక్ష్మి, గుండు సుదర్శన్, అప్పారావు, శేషు, భద్రం, రాంప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:డి.జె.వసంత్, కెమెరా:వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సహనిర్మాత:బి.శివకుమార్, నిర్మాత:బి.ఎ.రాజు, దర్శకత్వం:జయ.బి.