వెరైటీ టైటిల్‌తో త్రిష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ త్రిష ఈమధ్య సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దగ్గర నుండి భిన్నమైన సినిమాలు చేస్తూ సెలెక్టివ్‌గా ముందడుగు వేస్తోంది. గ్లామర్ డోస్ ఇంకాస్త పెంచి వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘నాయకి’ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ తరువాత ధనుష్‌తో నటించిన కోడి (్ధర్మయోగి) చిత్రంతో నటిగా మంచి మార్కులే కొట్టేసిన త్రిష తాజాగా మరో భిన్నమైన సినిమాలో నటిస్తోంది. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెరైటీ టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ ఏంటో తెలుసా.. ‘96’. ఈ టైటిల్‌తో వున్న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాక ఈ సినిమాపై కోలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం 1996లో జరిగే అంశాలతో రూపొందుతోందా? అనేది తెలియాల్సి వుంది. త్రిష ఇప్పటికే మోహిని పేరుతో మరో హర్రర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే!