కాజల్ నోట..ఓ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా మంచి జోరుమీదున్న కాజల్ ప్రస్తుతం తెలుగులో పవన్ సరసన
‘సర్దార్ గబ్బర్‌సింగ్’, మహేష్ సరసన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు తమిళంలో విక్రమ్, సూర్య వంటి హీరోల సరసన నటిస్తున్న ఈ భామ కన్నడలో కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే సినిమాల్లోని పలు పాటల్ని హీరోలు పాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా కన్నడంలో రూపొందుతున్న ‘చక్రవ్యూహ్’ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాట పాడారు. తన ఫ్రెండ్ పునీత్‌రాజ్‌కుమార్ కోసం ఈ పాట పాడినట్టు ఆయన తెలిపాడు. ఇదే సినిమాలో గ్లామర్ భామ కాజల్ కూడా ఓ పాట పాడటానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు హీరోయిన్‌గా చేసిన
ఈ భామ సింగర్‌గా కూడా మారనుంది. ‘జర్నీ’ ఫేం తమిళ దర్శకుడు శర్వానంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. కాజల్ పాడిన పాటని వచ్చేవారంలో రికార్డ్ చేయనున్నారు.