పిల్లల్ని కనాలంటే లైసెన్స్ ఉండాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డుమీద మోటారు వాహనం నడపాలంటే కచ్చితంగా లైసెన్స్ కావాలి. మనం ఎలాంటి ఉత్పత్తులను అమ్మాలన్నా లైసెన్స్ తప్పనిసరి. అలాంటిది పిల్లలను కనడానికి కూడా లైసెన్స్ ఉండాల్సిందేనని అంటోంది ఓ హీరోయిన్! ఆమె కామెంట్స్‌తో జనాలు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈ మాటలు అన్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమధ్య ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బుజ్జిగాడు’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ సంజన. ఎందుకు ఇలాంటి కామెంట్ చేసిందని ఆమెను అడిగితే.. బిచ్చగాళ్లు చిన్నపిల్లలను ఎత్తుకుని అడుక్కోవడం, చిన్న పిల్లలు భిక్షాటన చేయడం, బాల కార్మిక వ్యవస్థ.. ఇలాంటివన్నీ చూసిన ఆమెకు బాధ కలిగిందట! పిల్లల్ని కనే విషయంపై లైసెన్స్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీని రిక్వెస్ట్ చేసింది ఆమె. పోషించే స్థోమత లేని వారికి పిల్లలు ఎందుకని సూటిగా ప్రశ్నిస్తోంది.