ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవి దర్శకత్వంలో తమిళంలో రూపొందించిన చిత్రం తరకప్పు. ఈ చిత్రాన్ని వై.శేషిరెడ్డి సమర్పణలో వి.జె.వై.ఎస్.ఆర్. పతాకంపై తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’ అనే పేరుతో అందిస్తున్నారు. శక్తివేల్‌వాసు, సుముద్ర ఖని, వైశాలి, రియాజ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా వై.శేషిరెడ్డి చిత్ర విశేషాలు తెలుపుతూ- ‘చట్టసభల్లో కూర్చుని శాసనాలు చేసే రాజకీయ నాయకులు, కొందరు పోలీసు అధికారులతో, పారిశ్రామికవేత్తలతో కలసి సామాన్యులతో ఎలా ఆడుకుంటున్నారు? చివరికి ఏం జరిగింది? అనే కథాంశంతో చిత్రం సాగుతుంద’ని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల ఆధారంగా ఈ సినిమా చక్కని స్క్రీన్‌ప్లేతో ఉత్కంఠ భరిత సన్నివేశాలతో సాగుతుందని, అన్ని వర్గాల వారిని అలరిస్తుందని తెలిపారు. శక్తివేల్ వాసు, సముద్రఖని పోటాపోటీగా నటించిన ఈ చిత్రం సమాజానికి సందేశం అందించేలా ఉంటుందని, తమిళంలో పెద్ద హిట్‌గా నిలిచిందని అన్నారు. రెండు ప్రేమ జంటల చిలిపి విన్యాసాలు యువ ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాయని, క్లైమాక్స్ హైలైట్‌గా ఉంటుందని, పోలీస్ అధికారిగా శక్తివేల్ వాసు, మానవ హక్కుల చైర్మన్‌గా సముద్రఖని, విలన్‌గా రియాజ్ నటించారని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, కెమెరా: జోన్స్ ఆనంద్, సంగీతం: ఎఫ్.ఎస్.ఫైజల్, నిర్మాణం: వి.జె.వై.ఎస్.ఆర్.ఆర్ట్స్, సమర్పణ: వై.శేషిరెడ్డి, దర్శకత్వం: రవి.