నట విశ్వరూపం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కళ్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మన హీరోల సినిమా షూటింగ్‌లు మొదలైతే చాలు అభిమానులు తెగ ఊహించేసుకుంటుంటారు. ఎన్టీఆర్, బాబి కాంబినేషన్‌తో సినిమా నిర్మాణం ప్రారంభమైందో లేదో అప్పుడే ఆ సినిమా టైటిల్‌పై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాలాన్నిబట్టి ట్రెండ్‌కు తగినట్లుగా టైటిల్‌ను అభిమానులే సెలక్టు చేసేందుకు ఆరాటపడుతున్నారు. పెద్ద హీరో, గొప్ప డైరెక్టర్, కొంచెం భారీ బడ్జెట్ చిత్రం అయితే చాలు రకరకాల టైటిల్స్ ప్రచారం కావడం పరిపాటి. గౌతమీపుత్ర శాతకర్ణి వంటి వాటికి ముందే టైటిల్‌ను చెప్పేస్తారు. అలాంటి వాటికి అస్సలు గొడవ ఉండదు. చిరంజీవి 150వ చిత్రానికైతే చాలా టైటిల్స్ వినిపించాయి. మహేష్- మురుగదాస్ చిత్రమైతే చెప్పనే అక్కరలేదు. ఈ ఇద్దరి కలయికలో వచ్చే సినిమాకు టైటిల్ ఏంటన్నది డిసైడ్ కాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తారని, ముగ్గురు నాయికలు ఉంటారని, ఐటెం సాంగ్‌లో నాలుగో ముద్దుగుమ్మ కూడా కనిపించనుందని ఒకటే ఊహాగానాలు. ఈ సినిమాకు ఎన్టీఆర్ ‘నట విశ్వరూప’ అనే టైటిల్‌ను ఎంచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లు వేచి చూస్తే తప్ప ఈ ప్రచారంలో నిజమెంతో తెలుస్తుంది.