కథ నచ్చితే ఏ పాత్రకైనా ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘వంగవీటి’లో తన నటనతో అందరి దృష్టినీ ఆకర్షించిన నటుడు సందీప్‌కుమార్ అలియాస్ శాండి. ఈ ఒక్క సినిమాతోనే గుర్తింపు పొందిన ఆయన ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘సినిమాకు రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రేక్షకులు నన్ను మెచ్చుకుంటున్నారు. రాధ పాత్ర చాలా బాగుందని, ఆ తరువాత రంగా క్యారెక్టర్ నచ్చిందని అంతా అంటున్నారు. నేను పూరి జగన్నాధ్ ఆఫీసులో ఉన్నప్పుడు వర్మ నన్ను చూసి నాతో సినిమా తీస్తానన్నారు. ఆయన చెప్పిన కథకు నేను ఓకే చెప్పా. కథ చెప్పగానే రాధ పాత్ర గురించి నెట్లో వెతికాను. ఆ తరువాత నా సర్కిల్‌లో పలువురిని కనుక్కుని నటించే ప్రయత్నం చేశాను. ఇక రంగా పాత్ర గురించి పెద్దగా విషయాలు తెలియలేదు. ఫొటోలు మాత్రమే దొరికాయి. వాటిని చూసి రంగా ఎలా కూర్చుంటారు, ఎలా నడుస్తారు అనే విషయాలను ప్రాక్టీస్ చేశా. మాది కాకినాడ. బియస్సీ చదివాను. హైదరాబాద్ వచ్చి స్టేజీ షోలను చేసేవాణ్ణి. ఓ స్పానిష్ సినిమాలో చిన్న పాత్రలో నటించాను. ముంబై ఆడిషన్ కంపెనీ ద్వారా ఆ అవకాశం వచ్చింది. తరువాత పూరి జగన్నాధ్ తీసిన జ్యోతిలక్ష్మి, లోఫర్ సినిమాల్లో చేశాను. కథ బాగుండి మంచి డైరక్టర్ వుంటే ఎలాంటి పాత్రనైనా చేస్తా. బయోపిక్స్, కమర్షియల్స్ అన్న తేడా ఏం లేదు. అన్నిట్లో నటించడమే నా ముందున్న కర్తవ్యం.. అని వివరించారు.