పవన్ సినిమాలో ఖుష్బూ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు గ్లామర్ భామగా ఇమేజ్ తెచ్చుకుని తమిళంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ఖుష్బూ.. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టి అక్క, చెల్లి పాత్రల్లో నటిస్తోంది. ఆమధ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ చిత్రంలో కనిపించిన ఖుష్బూ ఇపుడు పవన్‌కళ్యాణ్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఖుష్బూ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇన్నాళ్లకు ఖుష్బూ క్లారిటీ ఇచ్చింది. త్రివిక్రమ్ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అత్తా, అమ్మ పాత్రల్లో నటిస్తున్న నదియా ఇప్పుడు సౌత్‌లో మంచి క్రేజ్ వున్న ఆర్టిస్టుగా మారిపోయింది. ఆ కోవలోనే ఖుష్బూ కూడా క్రేజ్ తెచ్చుకుంటుందేమో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్‌ల కలయికలో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ తరువాత రూపొందే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చిన ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలుకానుంది.