బాలయ్యతో ఎస్.వి.కృష్ణారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఆడియో విడుదలైంది. సంక్రాంతి కానుకగా దీన్ని విడుదల చేస్తారని సమాచారం. కాగా, బాలయ్య 101వ సినిమాపై అప్పుడే ఆసక్తికర వార్తలు పుట్టుకొస్తున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తరువాత మళ్లీ ఆ సినిమా ఊసే లేదు. ఈలోగా మరో ఒకరు ఇద్దరు దర్శకులు లిస్ట్‌లోకి వచ్చారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సీనియర్ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి. అప్పట్లో బాలయ్యతో ‘టాప్‌హీరో’ తీసిన కృష్ణారెడ్డి చాలాకాలం తరువాత బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశాడట. ఈమధ్యే బాలయ్యతో చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో ఉంటుందని, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్టు గురించి క్లారిటీ రావాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే!