ఫోకస్

ఫలితాలపై వేచిచూడాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నల్లధనంపై యుద్ధ ప్రకటించారు. ఇది ఎంత కాలం సాగుతుందో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడే చెప్పలేం. అయితే ప్రపంచంలో ఎవరికీ లేనంత సహనం మనవారికి ఉందని చెప్పవచ్చు. నోట్ల రద్దుపై ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డా, సహనంతో భరిస్తున్నారు. చదువుకున్నవారు, చదువులేనివారు, పేదలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా దేశంలోని ప్రజలంతా చాలా సహనంతో ఉన్నారు. అదే మరో దేశంలో అయితే కరెన్సీ నోట్ల రద్దుతో పరిస్థితి మరో విధంగా ఉండేది. మంచికోసమే చేశాడు, దీనివల్ల ఏదైనా మంచి జరగవచ్చు, నల్లధనం నిర్మూలన జరగవచ్చు అనే అభిప్రాయంతో ప్రజలు చాలా సహనంగా ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ఆరేళ్లపాటు జరిగింది. యూరప్‌లో అనేక దేశాల మధ్య యుద్ధాలు పాతికేళ్లపాటు కూడా జరిగాయి. మోడీ నల్లధనంపై ప్రకటించిన యుద్ధం ఎంతకాలం జరుగుతుందో చెప్పలేం. కరెన్సీ రద్దుతో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో, సమస్యలు ఏముంటాయో ముందుగా ఊహించలేకపోయారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే నల్లధన కుబేరులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి మరో ఎత్తు వేస్తున్నారు. నల్లధన కుబేరులు ఒక మార్గంలో ప్రయత్నిస్తుంటే ఆ మార్గాన్ని మూసేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ ముందే వారి చర్యలను ఊహించలేకపోయారు. జనధన్ ఖాతా ఒక దానిలో వంద కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారట, మరో ఖాతాలో 20 కోట్ల రూపాయలు జమ చేసినట్టు చెబుతున్నారు. దీన్నిబట్టి నల్లధనం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంకు నుంచి కరెన్సీ బ్యాంకులకు చేరేప్పుడు ఎక్కడా పొరపాటు జరగకుండా అనేక అంచెల్లో చర్యలు ఉంటాయి. అయినా పెద్దమొత్తంలో కరెన్సీ చేతులు మారింది. అంటే నల్లధన కుబేరుల ప్రభావం ఎంత బలంగా ఉందో స్పష్టం అవుతోంది. 50 రోజుల్లో పరిస్థితి మారుతుందని చెప్పారు. మరొక్కరోజులో 50 రోజుల గడువు ముగుస్తుంది. అయినా పరిస్థితి పూర్తిగా కుదుటపడే సూచనలు కనిపించడం లేదు. మరో 15 రోజుల సమయం పడుతుంది అనిపిస్తోంది. నోట్ల రద్దుతో ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారు అనే విషయం వాస్తవం. సమస్య తలెత్తినప్పుడు దానిని అవకాశంగా తీసుకోవాలి అంటారు. అదే విధంగా కరెన్సీ రద్దుతో వచ్చిన సమస్యను ప్రభుత్వం ఆన్‌లైన్ ఆర్థిక కార్యకలాపాలు పెంచేందుకు ప్రచారం చేస్తోంది. ప్రజలు 50 రోజులపాటు అష్టకష్టాలు పడినందుకు పరిహారంగా ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. పన్నుల్లో రాయితీలు వంటివి ఉండవచ్చునని అనుకుంటున్నాను. నల్లధనంపై ప్రకటించిన యుద్ధానికి ప్రజలు అండగా నిలిచి కష్టాలను సహనంతో సహించడం అభినందనీయం.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి చైర్మన్, ప్రజ్ఞ్భారతి