శాతకర్ణి లాయల్టీ కంటెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాతవాహన కాలం తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శకం. ఆ కాలానికి చెందిన శాతకర్ణి కథను తెరకెక్కిస్తున్నారు క్రిష్. తన ప్రయత్నంలో ప్రేక్షకులను భాగం చేసేందుకు గౌతమిపుత్ర శాతకర్ణి టీం తీసుకొస్తున్న ప్రోగ్రామ్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి లాయల్టీ కాంటెస్ట్’. గౌతమిపుత్ర శాతకర్ణి డాట్ కామ్ వెబ్‌సైట్‌లో అభిమానుల కోసం శాతవాహనుల అద్భుత చరిత్ర, బాలకృష్ణ వంద సినిమాల ప్రస్థానాన్ని పొందుపరిచారు. మీరు రాజుగా మారాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీరు గౌతమిపుత్ర శాతకర్ణి వెబ్‌సైట్‌లో లాయల్టీ కాంటెస్ట్‌లో వెంటనే రిజిష్టర్ అవ్వండి. సులువైన ప్రశ్నలకు వచ్చే సమాధానాల కోడ్స్‌లో శాతవాహనుల రాజ్యానికి చెందిన అమరావతి, అనూప, విదర్భ, సౌరాష్ట్ర, అవంతి, అసిక రాజ్యాల్లో మీరు జయించాలనుకున్న రాజ్యాలను ఎంచుకోండి. క్విజ్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిఫరెన్స్, ఫేస్‌బుక్, రేడియోల ద్వారా షేర్ చేయబోయే కోడ్స్ వంటి యాక్టివిటీస్‌లో పాల్గొని స్పిన్ వీల్ తిప్పండి. తద్వారా మీ రాజ్యబుద్ధి, భుజ, గజ, అశ్వ, ఆయుధ బలగాలను పెంచుకుని ఆ రాజ్యాలను జయించండి. పాయింట్స్ కూడగట్టి లీడర్ బోర్డులో టాప్‌కు చేరి ఆ రాజ్యంలో బహుమతులను చేజిక్కించుకోండి. సినిమాలో బాలయ్య ధరించిన వస్త్రాలు, స్మార్ట్ఫోన్స్, టీషర్ట్స్ సహా మరెన్నో బహుమతులను గెలుచుకోండి. ఈ పోటీ ద్వారా వచ్చిన డబ్బును బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా అందచేస్తారు. వందమందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఎంపికైన వందిమంది బాలకృష్ణతో కలిసి ప్రిమియర్ షో చూసి, డిన్నర్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని చిత్ర యూనిట్ తెలిపింది.