రొమాంటిక్ థ్రిల్లర్ నేనొస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైజింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ సమర్పణలో జ్ఞానప్రకాష్, సూర్య శ్రీనివాస్, ప్రియాంకా పల్లవి ప్రధాన పాత్రల్లో పరంద్ కళ్యాణ్ దర్శకత్వంలో భాషా మజహర్ నిర్మించిన నేనొస్తా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ,‘ట్రైలర్ చూశాక దర్శకుడిలోని ప్రతిభ, తను మాట్లాడాక నిర్మాతకున్న క్లారిటీ ఏమిటో అర్థమైంది. దర్శక నిర్మాతలిద్దరికీ మంచి భవిష్యత్తు వుంటుంది. తప్పకుండా హిట్టయ్యే చిత్రమిది. సినిమాటోగ్రఫీ, సంగీతం మంచి క్వాలిటీతో వున్నాయి’ అన్నారు. నిర్మాత భాషా మజహర్ మాట్లాడుతూ, దర్శకుడు పరంద్ కళ్యాణ్ ఎంచుకున్న కథ నచ్చడంతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్‌ను సెలెక్టు చేసుకుమని తెలిపారు. నిత్యం సమాజంలో మనకు ఎదురయ్యే పాత్రలతో పాటు ఒక టిపికల్ కేరెక్టర్ ఈ చిత్రంలో వుంటుందని, అలాంటి కేరెక్టర్ మన నిజ జీవితంలో ఎదురైతే పరిస్థితి ఏంటన్నదే ఈ కథ అని ఆయన వివరించారు. దర్శకుడు పరంద్ కళ్యాణ్ మాట్లాడుతూ, లవ్, రొమాన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకునేలా తెరకెక్కించామని, ఈనెల 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. జ్ఞానప్రకాష్ మాట్లాడుతూ, ‘హీరో అవ్వాలనే నా పదేళ్ల కల ఈ సినిమాతో నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు.