అక్కడ ఇంత గౌరవం దక్కదు -చిరంతన్ భట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కంచె’తో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించిన సంగీత దర్శకుడు చిరంతన్ భట్. తెలుగులో ఆయన చేస్తున్న రెండవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ 100వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదలకు సిద్ధం అవుతున్న సందర్భంగా చిరంతన్ భట్ చెప్పిన విశేషాలు..
శాతకర్ణి ఆడియో
చాలా గ్రాండ్‌గా చేశారు. బాలీవుడ్‌లో అయితే ఇంత గౌరవం ఉండదు. శాతకర్ణి పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలన్నీ పూర్తిచేయడానికి 4 నెలలు పట్టింది. అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. ‘సాహో సార్వభౌమ’ పాట కాస్త కష్టమనిపించింది. ఎందుకంటే అదే థీమ్‌సాంగ్ కాబట్టి. బాగా రావాలని ఎక్కువ కష్టపడ్డాను.
తేడా ఉంది..
‘కంచె’ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన సినిమా కాబట్టి అందులో మ్యూజిక్ వేరుగా ఉంటుంది. ‘శాతకర్ణి’ మన సంస్కృతి, మన రాజుకు సంబంధించినది కనుక ఇందులో వేరే రకం సంగీతం ఉంటుంది. సాహిత్యం అందించిన సిరివెనె్నల సీతారామశాస్ర్తీ కవిగానే చాలా గొప్ప వ్యక్తి. నాకు తెలుగు అంతగా రాదు. సన్నివేశంలో భావాన్ని బట్టి సంగీతం కంపోజ్ చేస్తా. తెలుగులో ఇంకా సినిమాలు చేయాలంటే భాష నేర్చుకోవాల్సిందే.
బాలకృష్ణతో పనిచేయడం
బాలకృష్ణతో కలసి ఈ ప్రాజెక్టులో నేను కూడా భాగం కావడం ఆనందంగా ఉంది. ఆయన 100వ చిత్రం చాలా స్పెషల్ అనుకుని ఇష్టపడి పనిచేశా. దర్శకుడు క్రిష్ మంచి విజన్ ఉన్న వ్యక్తి. బయటి ప్రపంచంతో కలవనట్టే ఉంటాడు. కానీ అన్నీ తెలుసుకుంటాడు.
మాది సినిమా ఫ్యామిలీనే. మా తాతగారు విజయ్‌భట్ సినిమా దర్శకుడు. మా నాన్న అరుణ్‌భట్ గుజరాతీ సినిమాలు ఎక్కువగా తీసేవారు. మా అంకుల్ సినిమాటోగ్రాఫర్, నా కజిన్ కూడా సినిమాల్లోనే పనిచేస్తున్నాడు.

- శ్రీ