గోపీచంద్ బల్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో దూసుకుపోతున్న గోపీచంద్‌కు ‘సౌఖ్యం’ స్పీడ్‌కు బ్రేకేసింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఫలితం అనుకున్న విధంగా లేకపోవడంతో ఇక తదుపరి సినిమాలపై మరింత కేర్ తీసుకుంటున్నాడు గోపీచంద్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆక్సిజన్’ చిత్రంతోపాటు ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. నిజానికి ఈ సినిమా ప్రారంభమై చాలాకాలమైనా త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట గోపీచంద్. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా గోపీచంద్ నటిస్తున్న ఈ సినిమాకు ‘జగన్మోహన్ ఐపిఎస్’ అనే టైటిల్‌ని పెట్టాలని అనుకున్నారట. కానీ ఈ టైటిల్ బాగోలేదని ప్రస్తుతానికి ‘బల్లెం’ అనే టైటిల్‌ని ఓకే చేశారట. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తిచేసి, విడుదల చేయాలని గోపీచంద్ పట్టుబట్టినట్టు తెలిసింది. అనుకోని కారణాలవల్ల ఆగిపోయిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. విడుదల చేసేందుకు ముందుకొచ్చిందట. మరి ఈ సినిమాతో గోపీచంద్‌కు సక్సెస్ దక్కుతుందో లేదో చూడాలి.