రెండు భాషల్లో శివలింగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రాఘవేంద్ర లారెన్స్, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్ళై నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘గతంలో నేను రూపొందించిన చంద్రముఖి తెలుగు, తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు కన్నడలో తీసిన శివలింగ సూపర్‌హిట్ అయ్యింది. ‘శివలింగ’ను తెలుగు, తమిళంలో ఏకకాలంలో సినిమాను షూటింగ్ చేశాం. కాంచన, కాంచన-2ల కంటే కు రాఘవేంద్ర లారెన్స్ నైపుణ్యం చూపాడు.’ అన్నారు. లారెన్స్ మాట్లాడుతూ, ‘ఇందులో కథే మొదటి హీరో. రితిక సింగ్ రెండో హీరో, శక్తివాసు మూడో హీరో అయితే నేను నాలుగో హీరో అవుతానంతే. చంద్రముఖి సినిమాలో జ్యోతికకు ఎంత మంచి పేరువచ్చిందో రితికకు అంత పేరు వస్తుంది.’ అన్నారు. రాఘవ లారెన్స్, రితిక సింగ్, వడివేలు, శక్తివాసు, రాధారవి, జయప్రకాష్, ప్రదీప్‌రావత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం: రామజోగయ్యశాస్ర్తీ, నిర్మాత: రమేష్ పి.పిళ్లై, దర్శకత్వం: పి.వాసు.