ఏరోజైతే చూశానో నిన్నూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.ఎస్. క్రియేషన్స్, శ్రీ శివపార్వతి కంబైన్స్ సంయుక్తంగా స్మితికాచార్య కథానాయికగా బాలా జి. దర్శకత్వంలో తన్నీరు సింహాద్రి, సిందిరి గిరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఏరోజైతే చూశానో’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి, ఈనెల 6న విడుదలకి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ హీరోయిన్‌గా పరిచయవౌతున్న స్మితికాచార్య గ్లామర్ ఈ సినిమాకు హైలెట్‌గా ఉంటుందని, ఆడియోకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. యూత్‌కు నచ్చే విధంగా రూపొందించామని, ఈనెల మొదటి వారమే విడుదల చేయాలని ఎప్పటినుంచో అనుకున్న విధంగానే విడుదల చేస్తున్నామని తెలిపారు. యూత్‌కు నచ్చే అంశాలతో రొమాంటిక్ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం తమ సంస్థకు మంచి పేరు తెస్తుందని దర్శకుడు బాలా జి. తెలిపారు.