కొత్తవారితో దేవుడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాను, శరత్, జై, అనూష, హరిణి, కారుణ్య ప్రధాన తారాగణంగా శాన్వీ క్రియేషన్స్, అమృతసాయి ఆర్ట్స్ పతాకాలపై సాయిరామ్ దాసరి దర్శకత్వంలో హరికుమార్ రెడ్డి జి. రూపొందిస్తున్న చిత్రం దేవుడా. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో సినిమాకు సంబంధించిన టీజర్‌ను నిర్మాత రాజ్‌కందుకూరి, లోగోను వంగవీటి ఫేమ్ వంశీ ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత హరికుమార్‌రెడ్డి జి. మాట్లాడుతూ.. కొత్త సంవత్సరం తొలి రోజున ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశామని, ఈ కథ అనుకున్నది అనుకున్న విధంగానే దర్శకుడు తెరకెక్కించారని, కథాకథనాల్లో దైవాంశికమైన అంశాలు ముడిపడి ఉంటాయని, షూటింగ్ మొత్తం పూర్తిచేశామని తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. విభిన్నమైన కథనంతో రూపొందిన ఈ చిత్రంలో భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని షూటింగ్ చేశామని, నటీనటులందరూ కొత్తవారైనా బాగా నటించారని, ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయని, దర్శకుడు సాయిరామ్ దాసరి తెలిపారు. కార్యక్రమంలో చిత్రంలో నటించిన హీరోహీరోయిన్లు పాల్గొని విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్‌క్రిష్, కెమెరా: తరుణ్ కె.సోని, నిర్మాత: హరికుమార్‌రెడ్డి జి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయిరామ్ దాసరి.