కమర్షియల్ నేత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల జంటగా రెడ్డెమ్ యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము రూపొందిస్తున్న చిత్రం నేత్ర (మై స్వీట్ హార్ట్). ఉదయ్ నాగ్త్రన్ అందించిన ఆడియో ఇటీవల విడుదలైంది. నిర్మాత రాము మాట్లాడుతూ, ట్రైలర్‌కు, పాటలకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. లవ్, హారర్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావలసిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని, కెమెరా పనితనం సినిమాకు హైలైట్‌గా వుంటుందని దర్శకుడు రెడ్డెమ్ యాదకుమార్ తెలిపారు. తొలి కాపీ సిద్ధమైందని, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నామని ఆయన తెలిపారు. సత్యానంద్, ఐ.కె.త్రినాధ్, ధీరేంద్ర ధీరు, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్ చరణ్, తిరుమలరెడ్డి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:ప్రసాదుల మధుబాబు, కెమెరా:ఎస్.వి.గోపాల్, ఎడిటింగ్:నర్సింగ్ రాధోడ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రెడ్డెమ్ యాదకుమార్.