వినోదాల వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయ.బి దర్శకత్వంలో ఆర్.జె.సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న చిత్రం వైశాఖం. ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసిన సందర్భంగా దర్శకురాలు జయ.బి. మాట్లాడుతూ, ‘లవ్‌వీ తర్వాత హిట్ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా ఇది. ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ కలసిన ఈ చిత్రం అపార్ట్‌మెంట్స్ నేపథ్యంలో సాగుతుంది. కజకస్థాన్‌లో తీసిన సాంగ్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతాయి’ అన్నారు. నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ,‘ మంచి సాంకేతిక విలువలతో తీస్తున్న ‘వైశాఖం’ మా బేనర్‌లో వచ్చిన లవ్‌లీకి రెట్టింపు విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం ఉంది. హిందీ, తమిళ రైట్స్ కోసం కూడా ఆఫర్స్ రావడం ఈ సినిమా మీద వున్న క్రేజ్‌కి నిదర్శనం అన్నారు. హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృధ్వీ, కాశీ విశ్వనాథ్, కృష్ణ్భగవాన్, శ్రీలక్ష్మి, గుండు సుదర్శన్, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్ టీమ్ వెంకీ, శ్రీ్ధర్, రాంప్రసాద్, తేజ, శశాంక్, లతీష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి:వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీతం:డి.జె.వసంత్, సహనిర్మాత:బి.శివకుమార్, నిర్మాత:బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం:జయ.బి.