అంధుడిగా రవితేజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య హీరో రవితేజ ఏ సినిమా చేయడానికి ఓకె చెప్పడం లేదు. ఇప్పటికే పలువురు దర్శకులు కథలు చెప్పినా ఎవరికీ కమిట్‌మెంట్ ఇవ్వడం లేదు. ‘బెంగాల్ టైగర్’ విడుదలై ఏడాది పూర్తయినా రవితేజ కొత్త సినిమాకు ముహూర్తం కుదరలేదు. ‘పటాస్’ దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు రవితేజ ఓకే చెప్పాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి తరువాత సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో కనిపిస్తాడట. కమర్షియల్ సినిమాలు చేస్తూ మాస్ మహారాజాగా ఇమేజ్ తెచ్చుకున్న రవితేజ ఇలాంటి భిన్నమైన సినిమా చేస్తుండడం విశేషం.