తమన్నా పెళ్లిచూపులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏంటీ.. టైటిల్ వినగానే షాక్ అవుతున్నారా? మీరనుకున్నది ఏం కాదు. అసలు విషయంలోకి వస్తే, ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై తెలుగులో ఘనవిజయం సాధించిన పెళ్లిచూపులు చిత్రం పలు భాషల్లో రీమేక్ చేసేందుకు గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ హక్కులు స్వంతం చేసుకున్నారు. ఇందులో హీరోయిన్‌గా తమన్నా నటిస్తుందట. విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రంలో రీతూ పాత్రను తమన్నా పోషిస్తోందట. హీరోగా కొత్త అబ్బాయిని పరిచయం చేస్తారని తెలిసింది. సెంథిల్ వీరాస్వామి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. గ్లామర్ హీరోయిన్‌గా సౌత్‌లో క్రేజ్ తెచ్చుకున్న తమన్నా ఇలాంటి చిన్న సినిమాల్లో కూడా నటిస్తూ నటిగా కూడా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుంది.