కథకు న్యాయం చేద్దామనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిర్మాతగా కథకు న్యాయం చేయడానికే ప్రయత్నిస్తా. ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వడమే కాదు, కథవల్ల సమాజానికి ఎంతోకొంత ఉపయోగం కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటా. వీటితో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలాగూ తప్పవు’- అని నిర్మాత బి.ఎ.రాజు తెలిపారు. ఆర్.జె. మూవీస్ పతాకంపై బి.జయ దర్శకత్వంలో ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం ‘వైశాఖం’ విడుదలకు ముస్తాబవుతోంది. తన జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పాత్రికేయులతో పలు విశేషాలను తెలిపారు.
అప్పుడేనా?
సినీ జర్నలిస్టుగా పనిచేసిన అనుభవంతో చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టా. వాటిలో చాలా చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి. అప్పుడే ఇంత కాలం గడిచిపోయిందా? అనిపిస్తుంది. నాకైతే రెండు మూడేళ్ళే అవుతున్నట్లుగా వుంటుంది.
పనిని ప్రేమిస్తా
ఇన్ని సంవత్సరాలైనా పరిశ్రమలో బోర్ లేకుండా పనిచేస్తున్నానంటే- పనిని ప్రేమించడమే కారణం. ఇష్టంగా చేస్తే ఏదైనా సరే కష్టం అనిపించదు. ఇంకా అనేక చిత్రాలకు ఎనర్జీతో పనిచేయాలనుకుంటా. పిఆర్‌ఓగా ఇప్పుడున్న అగ్ర తారలందరి సినిమాలకు పనిచేశా.
ఆయనే కారణం
నేను ఇండస్ట్రీకి రావడానికి హీరో కృష్ణ కారణం. ఆయన అభిమానిగా ఎదిగా. అందుకు తగ్గట్లు ఆయన కూడా అందించిన సహకారం మరువలేనిది.
డైరెక్షన్ వద్దు
దర్శకత్వం అనేది చాలా గురుతరమైన బాధ్యత. అది ఎంత కష్టమో తెలుసు. అందుకే అటువైపు వెళ్ళే సమస్యే లేదు. దర్శకత్వం మాత్రం చేయను.
ఇప్పుడు వైశాఖం
గుండమ్మగారి కృష్ణులు చిత్రం నుండి ఇటీవలి లవ్‌లీ చిత్రాల వరకూ మా సంస్థలో రూపొందించిన చిత్రాలన్నీ విజయవంతమయ్యాయి. ఇప్పుడు అవంతిక, హరీశ్ జంటగా వైశాఖం చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇదొక వైవిధ్యమున్న ప్రేమకథ. అపార్ట్‌మెంట్ సంస్కృతిలో ఓ అమ్మాయి, అబ్బాయి ఎలా తమ ప్రేమను పండించుకున్నారనే కథనంతో ఈ చిత్రం వైవిధ్యభరితంగా సాగుతుంది. మా సినిమాలన్నింటిలోకెల్లా వైశాఖం బెస్ట్‌మూవీ అవుతుంది.
తర్వాతి ప్రాజెక్టులు
వైశాఖం విడుదల కన్నా ముందుగా మరో చిత్రాన్ని రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నాం. ఇదో వైవిధ్యమైన కథనంతో రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

-యు