తరుణ్ లవ్‌స్టోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరుణ్, ఓవియా జంటగా రమేష్ గోపి దర్శకత్వంలో రామ్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరీ’. ఎస్.వి.ప్రకాష్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో కథానాయకుడు తరుణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ, కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగులో ‘ఇది నా లవ్‌స్టోరీ’గా రూపొందిస్తున్నామని, అందరూ కొత్తతారలతో, తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం కన్నడంలో సూపర్‌హిట్ అయిందని, ఔట్ అండ్ ఔట్ ప్రేమకథగా ప్రేక్షకుల మన్ననలు పొందిందని తెలిపారు. తాను ఈ చిత్రంలో మూడు వైవిధ్యమైన పాత్రల్లో కన్పిస్తానని, మాటలు, స్క్రీన్‌ప్లేతోపాటుగా కథనంలొ రొమాంటిక్ కామెడీ హైలెట్స్ అందరికీ నచ్చుతాయని అన్నారు. సినిమా వైవిధ్యంగా సాగే ఈ చిత్రం ఇప్పటివరకూ 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని, నాలుగు పాటలు, మరో 20 రోజుల టాకీపార్ట్ మిగిలిందని, కన్నడ సినిమా అయినా తెలుగు నేటివిటికి దగ్గరగా రూపొందిస్తున్నామని, సినిమా అంతా ప్రేమజంటపైనే సాగుతుందని తెలిపారు.
కన్నడలో ఈ సినిమా చూశాక తెలుగులో కొన్ని మార్పులు చేసి రూపొందిస్తే హిట్ అవుతుందన్న నమ్మకంతో తరుణ్ కథానాయకుడిగా ప్రారంభించామని, 70 శాతం షూటింగ్ పూర్తిచేశామని దర్శకుడు రమేష్ గోపి అన్నారు. ఒక అమ్మాయిని ఎన్ని సంవత్సరాలుగా ప్రేమించామన్నది ముఖ్యం కాదని, ఎంత బాగా ప్రేమించామో అనేదే ప్రధానమైన అంశంగా ఈ చిత్రం సాగుతుందని ఆయన అన్నారు. సినిమా షూటింగ్ పూర్తిచేసి మార్చి మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. కార్యక్రమంలో కథానాయిక ఓవియ, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీనాధ్ విజయ్, కెమెరా: క్రిష్ట్ఫోర్ జోసఫ్, మాటలు: వీరబాబు బాసిన, ఎడిటింగ్: శివకుమార్, నిర్మాత: ఎస్.వి. ప్రకాష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ గోపి.