19 నుంచి మహానుభావుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన ‘శతమానం భవతి’ సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలకు సిద్ధమైంది. రెండు భారీ చిత్రాల మధ్య దీన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశాడు నిర్మాత దిల్‌రాజు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యాడు శర్వానంద్. యూత్ పల్స్ తెలిసిన మారుతి ఇటీవలే బాబు బంగారం చిత్రాన్ని రూపొందించాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఈనెల 19నుండి జరుపుతారు. ఈ చిత్రానికి మహానుభావుడు అనే టైటిల్‌ను నిర్ణయించారు. శర్వానంద్ సరసన కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మెహరిన్‌కౌర్ హీరోయిన్‌గా నటిస్తోంది. యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.