ఈనెలలో సింగం-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం యముడు-3 (సింగం-3). తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా రూపొందిస్తుండగా తెలుగులో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. గత నెలలో విడుదల కావలసిన ఈ చిత్రం ఈనెలలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ, అనుష్క, శృతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం సూర్య కెరీర్‌లోనే ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిందని తెలిపారు.ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారని, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుందని తెలిపారు. నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి విధి నిర్వహణలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడనే కథనంతో సినిమా సాగుతుందని తెలిపారు. రాధిక శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జైరాజ్, దర్శకత్వం: హరి.