రాములమ్మ రీ ఎంట్రీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో హీరోలకు దీటుగా సినిమాలు చేసి మెప్పించింది విజయశాంతి. అప్పట్లో గ్లామర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత సోలో సినిమాలతో ఆకట్టుకుని లేడీ అమితాబ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న విజయశాంతి ఆ తర్వాత ఒసేయ్ రాములమ్మ చిత్రంతో ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ పరాజయం పాలవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. రాజకీయాల్లోకి ప్రవేశించి, టిఆర్‌ఎస్ పార్టీలో పనిచేసింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలతో మళ్లీ రాజకీయాలకు దూరమైన విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 చిత్రంలో నటిస్తుందని రూమర్లు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం మళ్లీ లేడీ ఓరియంటెడ్ పాత్రల ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట. ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, తెలుగు,తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఏదేమైనా దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వచ్చేవరకు ఆగాల్సిందే.