నాకిది స్పెషల్ మూవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజ నటిగా తెలుగు తెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయసుధ ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి సరసన జయసుధ నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా జయసుధ చెప్పిన విశేషాలు.
ఇనే్నళ్ల కెరీర్‌లో..
హీరోయిన్‌గా, నటిగా 45 ఏళ్ల కెరీర్‌లో ఈ సినిమా విడుదలవుతుందంటే ఓ పక్క ఆనందంగా, మరో పక్క భయంగా వుంది. ఎందుకంటే నేను నటించిన రెండు చిత్రాలు శతమానం భవతి, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య రెండు సినిమాలు ఒకేసారి వస్తున్నాయి. ఈ చిత్రంలో నారాయణమూర్తితో కలిసి నటించడం ఎగ్జైటింగ్‌గా వుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. మేమిద్దరం కలిసి నటిస్తే ఎలా వుంటుందో అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సామాజిక సమస్యతో
ప్రస్తుత సమాజంలోని ఓ సమస్యను ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. ఒక రకంగా నారాయణమూర్తి స్టయిల్‌లోనే ఈ సినిమా ఉంటుంది. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో నటించడం ఆనందంగా వుంది. ఆయన నిర్మించిన ఐదు చిత్రాల్లో నటించాను. ఈ సినిమాలో కూడా మంచి మెసేజ్ ఉంటుంది. నేను, నారాయణమూర్తి పోటీపడి మరీ నటించాం. తప్పకుండా మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకం వుంది అంటూ ముగించారు.

- శ్రీ