తెలుగు జాతికి గర్వకారణం శాతకర్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. బాలకృష్ణ అభిమానులు గత 41 రోజులుగా నిర్వహిస్తున్న శత పుణ్యక్షేత్ర యాత్ర ముగియడంతో హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ‘పరులకు మంచి చేస్తే పంచభూతాలు కూడా సహకరిస్తాయి. ప్రజలకు మేలు చేసినవారికి ప్రపంచంలో ఎదురుండదు. ముక్కలుగా ఉన్న రాజ్యాలను ఏకం చేసి, విదేశీయుల్లో భయం సృష్టించిన గొప్ప చక్రవర్తి శాతకర్ణి. కరీంనగర్‌లోని కోటిలింగాలలో పుట్టిన ఆయన పేగు కోసినప్పుడే ఉనికిని చాటుకున్నారు. తెలుగు జాతి ఉనికిని చాటి చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత కథతో రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 12న విడుదల కాబోతోంది. సంక్రాంతి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఇలాంటి సినిమాలు నిర్మించాలంటే నిర్మాతకు గట్స్ అవసరం. అందుకు మా నిర్మాతలను అభినందిస్తున్నా. క్రిష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. సాయిమాధవ్ అద్భుతమైన డైలాగులు రాశాడు. అందరికీ నచ్చే హంగులతో తెరకెక్కిన ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పన్ను మినహాయింపు ఇవ్వడం అభినందనీయం. ఇలాంటి గొప్ప సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. అభిమానులంతా కలిసి 9 రాష్ట్రాల్లో 41 రోజుల పాటు వంద దేవాలయాలను సందర్శించి శత పుణ్యక్షేత్ర కుంకుమార్చనను పూర్తిచేయడం ఆనందంగా వుంది’ అన్నారు.