ద్యావుడా దర్శకుడి క్షమాపణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు సాయిరామ్ దాసరి నేతృత్వంలో రూపొందుతున్న ‘ద్యావుడా’ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం టీజర్ విడుదలయ్యాక ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, దర్శకుడు దొరికితే వదలబోమని హెచ్చరికలు వెలువడిన నేపథ్యంలో సాయిరాం స్పందించారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనేది తన ఉద్దేశం కాదని, తాను కూడా దేవుళ్లను పూజిస్తానని ఆయన తెలిపారు. ఇంతమంది తన సినిమా టీజర్ చూసి స్పందిస్తుంటే దానికి బాధ్యత వహిస్తూ ముందుగా తనలాంటి భావాలున్న సోదరులందరికీ తాను క్షమాపణ చెబుతున్నానని, కర్ణాటకలోని ఉజ్జయినీ దేవాలయంలో శివుడికి సిగరెట్లతో, మందుబాటిళ్లతో పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉంది కనుక, ఆ ఆచారాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ సినిమాలో శివ మహత్మ్యాన్ని చూపే ప్రయత్నం చేశామని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ దృశ్యాలను తమ చిత్రం నుండి తొలగిస్తున్నామని ప్రకటించారు.