చివరి దశలో సుడిగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివపార్వతి క్రియేషన్స్ పతాకంపై వెంకటేష్, మల్లేష్, ప్రాచి అధికారి, మమతా కులకర్ణి ప్రధాన తారాగణంగా రమేష్ అంకం దర్శకత్వంలో చిట్టితల్లి లక్ష్మి సమర్పణలో రూపొందిస్తున్న చిత్రం సుడిగాలి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ 80 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాలలో శృంగారం చేయకూడదని, అది ప్రకృతి విరుద్ధమని, అలా చేయడం వల్ల కోరికలు తీరక చనిపోయిన మనిషి ఆత్మగా మారి సుడిగాలి రూపంలో అయినవారిని ఆవహించి నానా కష్టాలకు గురిచేస్తాయన్న కథనంతో రూపొందించామని తెలిపారు. నేటి యువతరం, పిల్లలు మొబైల్స్‌లో అశ్లీల దృశ్యాలు చూసి పెడదారిన పడుతున్నారని, సృష్టివిరుద్ధమైన కార్యకలాపాలు నిషేధించాలనే అంశంతో ఈ చిత్రాన్ని వైవిధ్యంగా రూపొందించామని అన్నారు. ఈ నెలాఖరుకు పోస్ట్‌ప్రొడక్షన్ పూర్తిచేసి ఫిబ్రవరిలో ఆడియో విడుదల చేసి మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. నరసింహ, సుహాసిని, అశోక్‌వర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:శ్రీను, సంగీతం:రాప్ రాక్ షకీల్, ఎడిటింగ్:శ్రీశైలం, కధ, స్క్రీన్‌ప్లే, కెమెరా, దర్శకత్వం:అంకం రమేష్.