సంభవం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగర్ హీరోగా, స్వప్నిక హీరోయిన్‌గా కళింగ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నండూరి వీరేష్ దర్శకత్వంలో గూన అప్పారావు నిర్మిస్తున్న చిత్రం ‘సంభవం’. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆత్మీయ అతిథుల మధ్య ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత బాబా భాయ్, నటులు ఆవుల వీరశేఖర్ యాదవ్, హీరో సాగర్, హీరోయిన్ స్వప్నిక, దర్శకుడు నండూరి వీరేష్, చిత్ర నిర్మాత గూన అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో సాగర్, హీరోయిన్ స్వప్నికపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి విద్యాసాగర్‌రావు క్లాప్‌నివ్వగా, మాజీ ఎంపీ ఆవుల వీరశేఖర్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సన్నివేశానికి ప్రముఖ వ్యాపారవేత్త బాబాభాయ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత గూన అప్పారావు మాట్లాడుతూ, ‘మా బ్యానర్‌లో లవ్ స్పాట్, గురుబ్రహ్మ చిత్రాలను నిర్మించాం. అవి త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. మూడో చిత్రంగా ‘సంభవం’ ప్రారంభించాం. సాగర్, స్వప్నికతో పాటు ఓ ప్రముఖ హీరో, హీరోయిన్ నటిస్తున్నారు. మర్డర్, మిస్టరీ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయి. వాటికి భిన్నంగా సాగే చిత్రమిది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం, జనవరి 20 నుండి ఫిబ్రవరి 5 వరకు మరో షెడ్యూల్ చేస్తాం. డాడీ శ్రీనివాస్ ఐదు మంచి ట్యూన్స్ కంపోజ్ చేశారు’ అన్నారు. దర్శకుడు నండూరి వీరేష్ మాట్లాడుతూ,‘ఇటీవల రమ్యకృష్ణతో జగన్మాత అనే సినిమా చేశాను. ఇది నా ఐదవ సినిమా. హారర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. అనేక ట్విస్ట్‌లతో ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే విధంగా చిత్రం ఉంటుంది’ అన్నారు. రఘుబాబు, శివాజీరాజా, సుమన్‌శెట్టి, చిట్టిబాబు, జబర్దస్త్ అప్పారావు, అమిత్, అశోక్‌కుమార్, జూ.రేలంగి, అల్లరి సుభాషిణి, ఢిల్లీ రాజేశ్వరి, శ్రీదేవి, దేవిక తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు, సంగీతం:డాడీ శ్రీనివాస్, కెమెరా:నాగబాబు కర్రా, ఎడిటింగ్:శ్రీనుబాబు, ఆర్ట్:రామకృష్ణ, నిర్మాత:గూన అప్పారావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:నండూరి వీరేష్.