ఈనెల చివరి వారంలో 7టు4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్, రాజ్‌పాల్ ముఖ్యపాత్రల్లో విజయ్‌శేఖర్ సంక్రాంతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘7టు4’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో సెన్సార్‌కు సిద్ధమైన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు విజయ్‌శేఖర్ మాట్లాడుతూ ‘ఈనెల 12న సెన్సార్ జరగనుంది. ఈ సినిమాను టీమ్ అందరూ కలిసి ఎంతో ఎఫర్ట్‌పెట్టి పనిచేశారు. రాత్రి 7 గంటలనుండి ఉదయం 4 గంటల వరకు జరిగే కథతో ఈ చిత్రం ఉంటుంది. క్రైమ్, వయలెన్స్, సస్పెన్స్‌ల నేపథ్యంలో సాగే కథ. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కే ఈ సినిమాలో రేపులు చేస్తున్న వారిని ఓ ప్రత్యేకమైన గ్యాంగ్ పట్టుకొని శిక్షిస్తుంది. ఈ విషయం పోలీసులకు కూడా అర్థంకాదు. ఎవరు వీరు ఎందుకిలా చేస్తున్నారు అనే ప్రశ్న పోలీసుల్లో ఉంటుంది. తప్పు జరిగినప్పుడే శిక్ష పడాలి అనే కానె్సప్ట్‌తో ఆ టీమ్ ఉంటుంది. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కే ఈ సినిమాలోని పాటల్ని ఈనెల మూడో వారంలో విడుదల చేసి, చిత్రాన్ని ఇదేనెల చివరి వారంలో విడుదల చేస్తామని’ అన్నారు.