ఫిబ్రవరిలో లవర్స్ క్లబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనీష్ చందర్, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన తారాగణంగా ధృవశేఖర్ దర్శకత్వంలో ప్లాన్ బి ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు శ్రేయా ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘లవర్స్ క్లబ్’. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ విడుదలై ఆదరణ పొందుతోందని నిర్మాత భరత్ అవ్వారి తెలిపారు. సంక్రాంతి తరువాత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని, ఈ సినిమా పక్కా యూత్‌ఫుల్, ఎమోషన్ లవ్‌స్టోరీగా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. గత సంవత్సరం చిన్న చిత్రాలు సక్సెస్ సాధించాయని, అదే ధైర్యంతో ఈ సినిమాను రూపొందించామని, ఆడియోను, సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామన్నారు. ప్రేమికులకు అండగా నిలిచే ఓ యువకుడి జీవితంలో అనుకోవని సమస్యలు వస్తే ఎలా ఎదుర్కొన్నాడనే కథనంతో చిత్రం సాగుతుందని, యథార్థ సంఘటనలు చూసి ఈ చిత్రాన్ని రూపొందించామని అన్నారు. భాషా, వైజాగ్ ప్రసాద్, అజయ్ రత్నం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:రవి నిడమర్తి, ఎడిటింగ్:కిరణ్‌కుమార్, కెమెరా:బి.వి.ఎస్.ఎస్.ప్రకాష్‌రావు, మాటలు:ప్రదీప్ ఆచార్య, నిర్మాత:్భరత్ అవ్వారి, రచన, దర్శకత్వం:్ధృవ శేఖర్.