అర్ధ శతదినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్, నందిత శేత, హెబాపటేల్ హీరో హీరోయిన్లుగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం మంచి విజయాన్ని అందుకుని అర్ధ శతదినోత్సవాన్ని పూర్తిచేసుకుంది. 28 థియేటర్లలో ఈ చిత్రం 50 రోజులు పూర్తిచేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సమక్షంలో 50 రోజుల వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ,‘చిన్న చిత్రాలు బాగా ఆడినప్పుడు ఆనందించేవాళ్లలో నేను మొదటివాణ్ణి. మంచి కానె్సప్టుతో తెరకెక్కిన ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా వుంది. ఈ రోజుల్లో 28 కేంద్రాలలో 50 రోజులు పూర్తిచేసుకోవడం విశేషం’ అన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ,‘దాసరి సమక్షంలో 50 రోజుల పండుగ చేసుకోవడం ఆనందంగా వుంది. కానె్సప్టును నమ్మి సినిమా చేశాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు అభినందించినందుకు ఆనందంగా వుంది’ అన్నారు. దర్శకుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ, ‘నా లైఫ్‌లో మొదటి షీల్డ్‌ను దాసరి చేతుల మీదుగా అందుకోవడం ఆనందంగా వుంది’ అన్నారు.