రాజవౌళి మహాభారతం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన దర్శకుడిగా రాజవౌళి గుర్తింపు పొందాడు. ఆయన తెరకెక్కించిన బాహుబలి భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాహుబలికి సీక్వెల్‌గా బాహుబలి-2 రూపొందిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ సినిమా తరువాత రాజవౌళి తదుపరి సినిమా ఏమిటనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా రాజవౌళి తర్వాతి సినిమా ఎవరితో అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ, తన భవిష్యత్ ప్రణాళికలు ఏమిటన్న విషయంపై రాజవౌళి స్పందించడం విశేషం. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన స్పందిస్తూ- మహాభారత కథను మునుపెన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో చూపించాలన్నదే తన కోరిక అని చెప్పాడు. అందులోనుండి ఓ పాత్రను తీసుకున్నా, ఓ ఉపకథను తీసుకున్నా ఎంతగానే ప్రభావితం చేస్తుందని చెప్పాడు. సినిమా అంటూ తీస్తే ఓ 30 ఏళ్ళపాటు గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు. ఆయన మాటలను బట్టి రాజవౌళి మహాభారతం కథతోనే తదుపరి సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాహుబలి లాంటి క్రియేటివ్ కథతో సంచలనం రేపిన రాజవౌళి మరి మహాభారతం తీస్తే అది ఇంకెన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి.